● పండ్లు 11.. ధర రూ.వెయ్యి | - | Sakshi
Sakshi News home page

● పండ్లు 11.. ధర రూ.వెయ్యి

Nov 24 2026 12:24 AM | Updated on Nov 24 2026 12:24 AM

ఏకాదశ రుద్రులు అంటే శివుని 11 స్వరూపాలుగా భక్తులు విశ్వసిస్తారు. అందుకే కార్తిక పౌర్ణమి వేళ 11 కాయలున్న అరటి అత్తాన్ని శివలింగం ముందుంచి పూజిస్తే సకల దోషాలూ తొలగి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రగాఢంగా నమ్ముతారు. అందునా కర్పూర అరటిని శుభ్రమైనదిగా, సాత్విక ఫలంగా భావిస్తారు. దీనిని నైవేద్యంగా పెట్టడం వల్ల మనసు నిర్మలంగా మారుతుందని పండితులు చెబుతారు. అరటి చెట్టును వంశాభివృద్ధికి, నిత్య నూతనత్వానికి ప్రతీకగా భావిస్తారు. కార్తిక పౌర్ణమి నాడు అరటి అత్తాన్ని దానం చేయడం లేదా దేవునికి సమర్పించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో 11 కాయలున్న కర్పూర రకం అరటి అత్తానికి ఎక్కడ లేని డిమాండూ ఉంటుంది. మామిడికుదురులో సోమవారం ఇటువంటి 11 పండ్ల అరటి అత్తానికి రికార్డు స్థాయిలో రూ.800 నుంచి ఏకంగా రూ.1,000 వరకు ధర పలికింది.

– మామిడికుదురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement