● వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
● స్వాగతించిన పార్టీ జిల్లా
అధ్యక్షుడు జగ్గిరెడ్డి
ఆత్రేయపురం: పేరవరంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, పాలనపై అసంతృప్తితో ఆ గ్రామానికి చెందిన గారపాటి ప్రసన్న కుమార్, మురళీకృష్ణ, అటపాకల దుర్గా ప్రసాద్‌తో పాటు టీడీపీకి చెందిన 15 కుటుంబాల వారు ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. పేరవరంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వారికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీపై, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై ప్రజల్లో రోజురోజుకూ విశ్వాసం పెరుగుతున్నాయని అన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత గుర్తింపు, గౌరవం ఇస్తామన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలు వైఎస్సార్ సీపీ వైపు అడుగులు వేస్తున్నారని చెప్పారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాయి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి బెజవాడ సతీష్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


