ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌

అమలాపురం రూరల్‌: శాసన మండలి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలకు అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటర్లుగా నమోదయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా సుమారు 3,912 మంది అర్హులైన ఉపాధ్యాయులున్నట్లు అంచనా వేయగా, ఇప్పటి వరకు 2,592 మంది నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక ఓటు కోసం దరఖాస్తులు అందాయని చెప్పారు. వీటిలో 1,811 స్వీకరించామని, 41 తిరస్కరించామని, 740 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలల్లోని అర్హులైన అధ్యాపకుల వివరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలతో సమన్వయం చేసుకుంటూ దరఖాస్తుల స్వీకరణను వేగవంతం చేస్తున్నామని, రెండు మూడు వారాల్లో లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు. డిసెంబర్‌ 23న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అనంతరం క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియలో మిగిలిన అర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటరుగా నమోదయ్యే అవకాశం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement