బ్లో అవుట్ నేపథ్యంలో 500 మంది బాధితుల్ని నగరం, మామిడికుదురు జెడ్పీ హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. నగరం జెడ్పీ హైస్కూల్ పునరావాస కేంద్రం వద్ద ఓఎన్జీసీకి వ్యతిరేకంగా నగరం గ్రామస్తులు ఆందోళన చేశారు. ఆ సంస్థ కార్యకలాపాలతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని, ఏ సమయంలో ఏం ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరుగుతుందని కొన్ని రోజులుగా సంకేతాలున్నప్పటికీ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే ఈ బ్లో అవుట్ జరిగిందని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, ఓఎన్జీసీ కార్యకలాపాలను తక్షణం నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.


