అన్నవరం: స్థానిక సత్యదేవుని దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి నూజివీడుకు చెందిన దాత సత్యసారథి, వైజయంతి దంపతులు సోమవారం రూ.8 లక్షలను విరాళంగా సమర్పించారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా అక్టోబర్ 28న దాత దంపతుల పేరుపై అన్నదానం చేయాలని కోరారు. వీరికి సత్యదేవుని చిత్రపటం, ప్రసాదం, అన్నదానం బాండ్‌లను దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు అందజేశారు.
రిమాండ్ ఖైదీ మృతి
కాకినాడ క్రైం: తాళ్లరేవు మండలంలో ఇటీవల సంచలనం సృష్టించిన సంగాడి కామేష్‌వర్మ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగాడి దుర్గా మల్లేశ్వరరావు (18) చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. కాకినాడ వనటౌన్ పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలేనికి చెందిన కామేష్ వర్మ, పాలెపు సతీష్, పినపోతు కేశవ, దుర్గా మల్లేశ్వరరావు స్నేహితులు. గ్రామంలో జరిగిన నో దొంగతనం కేసులో వీరు నిందితులు. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన వారిలో కామేష్‌వర్మ గత నెల 28 నుంచి కనిపించకుండా పోయి, సీతారామపురం ఇసుక ర్యాంపు సమీపాన ఆత్రేయ గోదావరిలో శవమై తేలాడు. అతడి మృతికి స్నేహితులే కారణమంటూ పలువురు వారిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో పాలెపు సతీష్, పినపోతు కేశవ తీవ్రంగా గాయపడి, కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో యువకుడు సంగాడి దుర్గామల్లేశ్వరరావు గ్రామస్తుల కళ్లుగప్పి పరారై, ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యాన కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ ఈ నెల 14న మల్లేశ్వరరావును అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. కాగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
జాతీయ స్థాయి
రెజ్లింగ్ పోటీలకు ఎంపిక
యానాం: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు యానాం యువకుడు అడపా సంపత్‌కుమార్ ఎంపికయ్యారు. డిసెంబర్ 15 నుంచి 18 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆయన పుదుచ్చేరికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇటీవల పుదుచ్చేరి 8వ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్–2026లో సంపత్‌కుమార్ స్వర్ణపతకం సాధించారు. అదేవిధంగా సీనియర్ విభాగం 72 కిలోల విభాగంలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని జాతీయ పోటీలకు అర్హత పొందారు. యునైడెట్ పుదుచ్చేరి అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 14, 15 తేదీల్లో ఉప్పళంలో రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీల్లో స్వర్ణపతకం సాధించారు. ఆయనను పలువురు అభినందించారు.


