ప్రత్తిపాడు/ ప్రత్తిపాడు రూరల్: ఈతకు వెళ్లిన ఓ బాలుడు శవమై తేలాడు. ప్రత్తిపాడు పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఒమ్మంగి గ్రామానికి చెందిన మొండి వినయ్ శివశంకర్ (13) ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద విచారించినా అతని ఆచూకీ లభించలేదు. దీనిపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం తెలిపారు. కాగా రాచపల్లి గ్రామంలోని ఉల్లింకల చెరువులో సోమవారం ఆ బాలుడు శవమై తేలాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఏడో తరగతి చదువుతున్న శివశంకర్ స్నేహితులతో కలసి ఈతకు వెళ్లినట్టు తెలిసిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


