అమలాపురం రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి భట్నవిల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాలను సోమవారం ఆయన సందర్శించి, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. పోలీసు బందోబస్తుపై డీఎస్పీ ప్రసాద్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు నిబంధనల ప్రకారమే కేంద్రాల్లోకి ప్రవేశించేలా చూడాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు, బెదిరింపులు, ఉద్రిక్తతలకు దారి తీసే పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన కేంద్రాల వద్ద ప్రత్యేక అప్రమత్తత పాటించాలని స్పష్టం ఎస్పీ చేశారు.


