వచ్చి చూసెళ్లారంతే.. | - | Sakshi
Sakshi News home page

వచ్చి చూసెళ్లారంతే..

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

ఇతని పేరు తాడి స్వామిబాబు. మలికిపురం మండలం పడమటిపాలెం గ్రామం. కూలి పని చేసుకుంటాడు. అర్నబ్‌ తుపాను దాటికి అతని తాటాకిల్లు కూలిపోయింది. ఇతని కుమార్తె 8 నెలల గర్భిణి. ఆమెను తీసుకుని భార్య వేరే అద్దె ఇంటికి వెళ్లారు. నేటికీ కూలిపోయిన ఇంటికి సాయం లేదు. కనీసం బియ్యం కూడా ఇవ్వలేదు. అధికారులు చూసి వెళ్లారంతే..

భయం భయంగా..

ఈమె పేరు యర్రంశెట్టి వెంకటలక్ష్మి. మలికిపురం మండలం సముద్ర తీరంలోని కేశనపల్లి గ్రామం. అర్నబ్‌ తుపాను రాత్రి ఆమె ఇంటిపై కొబ్బరి చెట్టు పడి పైకప్పు పూర్తిగా పడైంది. ఇంటి లోపలి గోడలు బీటలు వారాయి. భయంతోనే అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. మరో తుపాను హెచ్చరికల నేపథ్యంలో పైన అప్పు చేసి కొనుక్కున్న బరకం కప్పుకొన్నారు. కనీసం నిత్యాసరాలు కూడా ఇంకా అందలేదని ఆమె వాపోతున్నారు.

పక్కింట్లో తలదాచుకుని..

ఈమె పేరు ఓగూరి రత్నకుమారి. సముద్ర తీరంలోని మలికిపురం మండలం పడమటిపాలెం గ్రామం. తుపాను రోజు రాత్రి ఆమె ఇళ్లు కూలిపోయింది. అర్ధరాత్రి పిల్లతో పక్కింటికి వెళ్లి తలదాచుకుంది. ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. అధికారులు వచ్చి ఫొటోలు తీసుకువెళ్లారు. నేటికీ బియ్యం, పప్పులు కూడా ఇవ్వలేదు. ఇంటి పరిహారం సంగతే లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement