బుధవారం శ్రీ 11 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 11 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

లో

● కార్తికం.. శుభారంభం

● చేతులెత్తి మొక్కుతున్నాం.. చేయూతనందించండి

ద్రాక్షారామ భీమేశ్వరాలయ

ప్రాంగణంలోని సప్తగోదావరి వద్ద

కార్తిక దీపాలు వెలిగిస్తున్న మహిళలు

కార్తిక మాసం ప్రారంభమైన వేళ మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి కాలువలు, నదులు, ఆలయ పుష్కరిణుల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని సప్త గోదావరిలో మహిళలు తెల్లవారుజామున పుణ్యస్నానాలు చేసి, అరటి డొప్పల్లో ఆవు నేతి దీపాలు వెలిగించి, గంగమ్మ ఒడిలోకి విడిచిపెట్టారు. అనంతరం భీమేశ్వరస్వామిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని పలు ఆలయాల వద్ద భక్తులు పరమేశ్వరుడికి అభిషేకాలు, పూజలు చేశారు. ఓం నమశ్శివాయ, హరహర మహాదేవ శంభోశంకర అంటూ భక్తిపారవశ్యంతో వారు చేసిన నామోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణాలు ప్రతిధ్వనించాయి.

– రామచంద్రపురం రూరల్‌

నేలతల్లిని నమ్ముకొని, వేలాది రూపాయల కౌలు చెల్లించి, చెమటోడ్చి పండించిన బంగారు పంట కొద్ది రోజుల్లో ఆ అన్నదాతల చేతికి అందేదే. కానీ, అంతలోనే విరుచుకుపడిన విపత్తులు వారి ఆశల్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేశాయి. అర్నబ్‌ తుపాను ధాటికి ప్రళయ భీకరమైన ప్రచండ గాలులతో భారీ వర్షాలు కురిశాయి. తర్వాత సరిగ్గా వారం రోజులకే ఎడతెరిపి లేని భారీ వర్షాలతో మురసు తుపాను మరోసారి ముంచేసింది. పసిడి గింజల్ని స్రవిస్తున్న వరి పంట.. ఆ రైతుల కళ్ల ముందే నేలనంటేసి, రోజుల తరబడి నీళ్లల్లో నానిపోయి సర్వనాశనమైంది. పెట్టుబడి పోయింది. పంట కోత ఖర్చులు కూడా భారమయ్యాయి. కొండంత అప్పులు మాత్రమే మిగిలాయి. వరుస తుపాన్లతో తమ బతుకులు అతలాకుతలమవడంతో ఆ కౌలు రైతుల కంట కన్నీరు వరద గోదారిలా పారుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. భూమి యజమానులు కూడా మానవతా దృక్పథంతో ఈ ఏడాది కౌలును పూర్తిగా రద్దు చేయాలని కన్నీటితో వేడుకున్నారు. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలోని పిల్లి అప్పారావు కమ్యూనిటీ భవనంలో పరిసర గ్రామాల రైతులు మంగళవారం ఏర్పాటు చేసుకున్న సమావేశంలో చోటు చేసుకున్న ఈ సంఘటన చూపరులను కలచివేసింది.

– రామచంద్రపురం రూరల్‌

8

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement