భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించాలి

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

రామచంద్రపురం రూరల్‌: కార్తిక మాసంలో ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించాలని దేవదాయ శాఖ రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ (ఆర్‌జేసీ) వేండ్ర త్రినాథరావు అధికారులను ఆదేశించారు. ఆలయంలో కార్తిక మాసం ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ అల్లు వెంకట దుర్గాభవానికి పలు సూచనలు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తాగునీరు, వసతి తదితరు సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

కౌశల్‌ పరీక్షకు

1,538 మంది హాజరు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యార్థుల్లో సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలపై నైపుణ్యాలను పెంపొందించడానికి నిర్వహించే కౌశల్‌–26 ఆన్‌లైన్‌ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 204 పాఠశాలల నుంచి 1,538 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా విద్యా శాఖ అధికారి పిల్లి రమేష్‌ మంగళవారం ఈ విషయం తెలిపారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 11న, పదో తరగతి విద్యార్థులకు 12వ తేదీన పరీక్షలు నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

పాపికొండల పర్యటనకు 55 మంది

దేవీపట్నం: గోదావరి నదిపై బోటు ప్రయాణం చేసే పాపికొండల విహారయాత్రకు మంగళవారం 55 మంది పర్యాటకులు తరలివెళ్లారు. ముందుగా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకున్న పర్యాటకులు రాజమహేంద్రవరం నుంచి పలు వాహనాల్లో పోశమ్మగండికి తరలివచ్చి నిబంధనలు పాటిస్తూ, తనిఖీల అనంతరం ఒక బోటుపై 55 మంది పర్యాటకులు పేరంటపల్లికి తరలివెళ్లారు. నిర్దేశించిన సమయానికి సాయంత్రం తిరిగి పోశమ్మగండికి చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement