దారుణంగా ధ్వంసమెన బీచ్ రోడ్డు
కెరటాల తాకిడికి బీచ్ రోడ్డుపై అగాధాల్లా పడిన గోతులు, లేచిపోయిన రాళ్లు
ఉప్పాడ తీర ప్రాంతాన్ని సాగరం కబళిస్తోంది. అర్నబ్ తుపాను కారణంగా ఎగసి పడిన అలలు, భారీ ఈదురు గాలులు కారణంగా కడలి కన్నెర్ర చేయడంతో ఉప్పాడ, కోనపాపపేట గ్రామాల్లోని తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారుల ఇళ్లు అపార జలధిలో కలసిపోతున్నాయి. సుమారు 50 ఇళ్లు కోతకు గురైనట్లు మత్స్యకారులు చెబుతున్నారు. వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. రోడ్లు కోతకు గురవుతున్నాయి. కోపపాపపేట, ఉప్పాడ, కొత్తపట్నం వద్ద కాకినాడ బీచ్ రోడ్డు సుమారు 5 కిలోమీటర్ల మేర ధ్వంసమైంది. రోడ్డుకు రక్షణగా వేసిన రాళ్ల గోడ సైతం సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
– కొత్తపల్లి


