ఆపద మొక్కుల వాడా.. అనాథ రక్షకా | - | Sakshi
Sakshi News home page

ఆపద మొక్కుల వాడా.. అనాథ రక్షకా

Oct 25 2026 12:17 AM | Updated on Oct 25 2026 12:17 AM

వాడపల్లికి పోటెత్తిన భక్తులు

ఆత్రేయపురం: ‘ఆపద మొక్కుల వాడా, అనాథ రక్షకా, గోవిందా గోవిందా!‘ అంటూ ఆ స్వామివారిని భక్తులు కొలిచారు. కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని ఆలయం గోవింద నామస్మరణలతో మార్మోగింది. శనివారం స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారు జాము నుంచే వివిధ రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించి, క్యూలైన్లో నిలబడి స్వామిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన వచ్చారు. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీహోమం, బాలభోగం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. స్వామివారిని పలు రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. కాగా పెద్ద సంఖ్యలో భక్తులు వకుళమాత అన్నదాన భవనంలో స్వామివారి ఉచిత అన్న ప్రసాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఉచిత పులిహోర ప్రసాదం, తాగునీరు అందించారు. అలాగే ఆర్యవైశ్య సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల వసతుల కల్పనకు, ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణకు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement