మద్యం అక్రమంగా తరలిస్తే కేసులు | - | Sakshi
Sakshi News home page

మద్యం అక్రమంగా తరలిస్తే కేసులు

Oct 25 2026 12:11 AM | Updated on Oct 25 2026 12:11 AM

తాళ్లరేవు: జాతీ య రహదారి 216లోని పి. మల్లవరం అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాకినాడ, కోనసీమ జిల్లాల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ రేణుక నేతృత్వంలో ట్రైనీ ఎస్సైలు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి మద్యం తరలిపోకుండా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమలు నేపథ్యంలో మద్యం, నగదు తరలించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలలో కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, చెక్‌పోస్టు పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement