ఓటమి భయంతోనే కూటమి కుట్రలు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే కూటమి కుట్రలు

Oct 25 2026 12:17 AM | Updated on Oct 25 2026 12:17 AM

పిఠాపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి కుట్రలకు పాల్పడుతుందని సీపీఐ నాయకుడు సాకా రామకృష్ణ విమర్శించారు. శనివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులను కొనుగోలు చేసే ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఆశించిన స్థాయిలో లేవని, రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పాటు పన్నులు, విద్యుత్‌ చార్జీల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా ఇళ్ల స్థలాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చెల్లింపు, మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం వంటి హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పప్పు నుంచి ఉప్పు వరకు, బియ్యం, పంచదార, వంటనూనెలు, కూరగాయల ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చదువు, సంస్కారం, ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉన్న అభ్యర్థులను గుర్తించి ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపి, కూటమి ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా వెల్లడించాలని సీపీఐ తరఫున పిలుపునిచ్చారు. సమావేశంలో కేతా రమణ, అర్జునరావు, అరుణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement