పారా మెడికల్
సిబ్బంది సమ్మె బాట
అమలాపురం టౌన్: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు (పారా మెడికల్ సిబ్బంది) సమ్మెకు దిగారు. విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టారు. బుధవారం నాటికి వీరి సమ్మె రెండో రోజుకు చేరుకుంది. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, కార్మిక చట్టాలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. వీరి శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరావు సందర్శించి మద్దతు ప్రకటించి కాంట్రాక్టు ఉద్యోగుల చేత ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటోందని, వారిని రెగ్యులర్ చేయడం లేదని ఆరోపించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్తిబాబు, సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా శాఖ సమ్మెకు మద్దతు ప్రకటించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గా ప్రసాద్ సమ్మె శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు.
లయన్స్ క్లబ్బుల జిల్లా పొలిటికల్
అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా గణపతి
అమలాపురం రూరల్: జిల్లా అభివృద్ధితో పాటు లయనిజం ద్వారా మానవతా సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధికారి ప్రతినిధి సూదా గణపతిని లయన్స్ క్లబ్స్ జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఈ మేరకు జిల్లా గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
రెవెన్యూ సమస్యలను
సత్వరం పరిష్కరించాలి
అమలాపురం రూరల్: అమలాపురం రూరల్: రెవెన్యూ సేవలను మరింత పారదర్శకంగా అందించి సమన్వయంతో భూ సమస్యలు పరిష్కరించాలని జేసీ వైఖోమ్ నైదియాదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌తో కొత్తపేట, అమలాపురం, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అంశాలపై సమీక్షించారు. రీ–సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని వీఆర్వోలు, సర్వేయర్లకు ఆదేశించారు. 22(ఏ) కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్ణీత కాల వ్యవధిలో ఫిర్యాదుల ను పరిష్కరించాలని సూచించారు. అర్హులందరికీ ఇళ్లు అందేలా రెవెన్యూ, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ పేర్కొన్నారు.
జాతీయ స్థాయి తైక్వాండోలో
తేజకు స్వర్ణం
అంబాజీపేట: జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలలో గెద్దాడ లాహితీ తేజ స్వర్ణ పతకం సాధించినట్లు జిల్లా తైక్వాండో కార్యదర్శి పితాని త్రిమూర్తులు, రిఫరీ, సీనియర్ కోచ్ పితాని భార్గవి శ్రీకళ తెలిపారు. ఈ నెల రెండో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన 40వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలలో సబ్ జూనియర్స్ విభాగంలో ఓవర్ 47 కేజీల కేటగిరిలో తేజ అత్యంత ప్రతిభ కనబరచి స్వర్ణ పతకం కై వసం చేసుకున్నట్టు తెలిపారు. ఆమెను, ఆమెకు తర్ఫీదు ఇచ్చిన భార్గవి శ్రీకళ, పి.ఆదిత్యలను పలువురు అభినందించారు.


