29 నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

29 నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు

Oct 8 2026 12:12 AM | Updated on Oct 8 2026 12:12 AM

ఆత్రేయపురం: మండలంలోని వాడపల్లి వేంకటేశ్వరుని 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 29 నుంచి నవంబర్‌ ఆరో తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఈఓ నల్లం సూర్య చక్రధరరావు బుధవారం ఆలయ కమిటీ సమావేశంలో తెలిపారు. 9 రోజుల పాటు జరిగే స్వామి వారి వాహన సేవల సందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని అందించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వాద్య బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నామని వివరించారు.

శివప్రసాద్‌కు స్టార్‌ ఆఫ్‌

ఇండియా పురస్కారం

యానాం: ఛత్తీస్‌గఢ్‌లో భారత బాల్‌ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 45వ బాలబాలికల సబ్‌ జూనియర్‌ జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పుదుచ్చేరి తరఫున ప్రాతినిధ్యం వహించిన యానాం క్రీడాకారులు ప్రతిభ కనబర్చారని యానాం బాడ్మింటన్‌ క్లబ్‌ కార్యదర్శి కాపగంటి అనురాగ ఆదర్శ శేష సుమన్‌ ప్రకటనలో తెలిపారు. బండి కుశాల్‌ వెంకట సుచిత్‌, బొమ్మిడి ఇతాష్‌ కృష్ణ, పెయ్యల కృష్ణమూర్తి, ఆకుల కస్తూరి శివప్రసాద్‌, పెయ్యల సుబ్రహ్మణ్యం, జువ్వల బాలాశ్రీ నిత్య, రవ్వనతి నిశృత, పోలిశెట్టి హర్షిణీదేవి పాల్గొనగా, బాలురు తృతీయస్ధానం, బాలికలు ద్వితీయ స్థానం , మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచారని తెలిపారు. జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ అందజేసే ప్రతిష్టాత్మక స్టార్‌ ఆఫ్‌ ఇండియా పురస్కారాన్ని ఆకుల కస్తూరి శివప్రసాద్‌ కై వసం చేసుకున్నారని తెలిపారు.

బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సంపత్‌రావు మృతి

అల్లవరం: బహుజన సమాజ్‌ వాదీ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గెడ్డం సంపత్‌కుమార్‌ అనారోగ్యంతో అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన ఆయన ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో స్థిరపడ్డారు. మొదటి నుంచి ఆ పార్టీ తరఫున విశేష సేవలు అందించారు. చల్లపల్లిలో గురువారం ఉదయం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement