అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం అందించాలి | - | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం అందించాలి

Oct 1 2026 12:17 AM | Updated on Oct 1 2026 12:17 AM

అమలాపురం రూరల్‌: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన ఎస్సీ ఎస్టీ జిల్లా విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ త్రైమాసిక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, శ్మశాన వాటికల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలను కలెక్టర్‌ పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ శ్మశాన వాటికలు ఆక్రమణలకు గురవుతున్నాయని పలువురు సభ్యులు చెప్పారు. రీసర్వేలో శ్మశాన భూములను స్పష్టంగా గుర్తించి, హద్దులు నిర్ణయించి, రికార్డుల్లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు శ్రద్ధ చూపాలని కోరారు. హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు, అడిషనల్‌ ఎస్పీ మహేంద్ర మత్తే, అమలాపురం, కొత్తపేట ఆర్‌డీఓలు ఎం.సరళావతి, జీవీ సత్యనారాయణ, డీఎస్పీలు టీవీకే ప్రసాద్‌, ఎస్‌.మురళీమోహన్‌, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వెంకటకృష్ణ, సమగ్ర శిక్ష పీఓ జి.మమ్మీ, జిల్లా విద్యా శాఖ అధికారి మహబూబ్‌ షా, డీఆర్‌డీఏ పీడీ డి.రాంబాబు, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కేశవవర్మ, డీఎస్‌ఓ విజయ భాస్కర్‌, డ్వామా పీడీ రామ్‌గోపాల్‌, ఐసీడీఎస్‌ పీడీ బి.శాంతికుమారి కమిటీ సభ్యులు పుణ్యమంతుల రజని, చిన్న అప్పారావు, జె.శ్రీనివాసరాజు, మోహన్‌ కుమార్‌ దాడి తదితరులు పాల్గొన్నారు.

గడువులోగా జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు

అమలాపురం రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న తాగునీటి సరఫరా, జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాలపై కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి నాణ్యత పరీక్షలు – పీఆర్‌ వన్‌ పత్రికను ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement