ప్రభుత్వ సొమ్మును పచ్చ నేతలకు దోచిపెట్టడానికి చంద్రబాబు నాటకాలాడటం విడ్డూరంగా ఉంది. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కరోనా వంటి విపత్కర సమయాల్లో ప్రజలకు విశేష సేవలందించిన మా పొట్టపై కొట్టారు. ప్రభుత్వ సొమ్ము దుబారా అన్నారు. ఇప్పుడు సొంత డప్పు కొట్టించుకోవడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సర్కారు సొమ్ము చెల్లిస్తామనడం చంద్రబాబు దగాకోరుతనానికి నిదర్శనం. ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి, పచ్చ నేతలకు దోచిపెట్టడానికి ఆయన ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు.
– ఎం.చాముండేశ్వరి, మాజీ వలంటీర్, ఆత్రేయపురం
ప్రభుత్వం సమాధానం చెప్పాలి
వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.5 వేలే ఇచ్చినా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పని చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని కొనసాగిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వ ప్రచారం కోసం సోషల్ మీడియాకు భారీగా చెల్లింపులు చేయాలనుకోవడం చూస్తే ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏమిటో అర్థమవుతోంది. ప్రజల కోసం పని చేసిన వారికి ఉపాధి కల్పించకుండా, సొంత ప్రచారం కోసం ప్రజాధనం ఖర్చు చేయడంపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
– పిసిని రాజేష్, మాజీ వలంటీర్, రఘుదేవపురం, సీతానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లా


