‘మాయ’కు రజత పతకం | - | Sakshi
Sakshi News home page

‘మాయ’కు రజత పతకం

Oct 1 2026 12:17 AM | Updated on Oct 1 2026 12:17 AM

అమలాపురం టౌన్‌: జిల్లా పోలీసు శాఖకు చెందిన బెల్జియన్‌ మాలినోయ్‌ జాతి (ఆడ) డాగ్‌ ‘మాయ’ నార్కో ట్రేడ్‌లో ద్వితీయ స్థానంతో రజత పతకం కై వసం చేసుకుంది. దీనికి మంగళగిరిలో నార్కోటిక్‌, ట్రాకర్‌ కోర్సులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో నార్కోటిక్‌ (మత్తు) పదార్థాలను గుర్తించడంలో మాయ ప్రతిభ చాటింది. దీనికి స్పేర్‌ హ్యాండ్లర్‌, కానిస్టేబుల్‌ విజయ్‌ కుమార్‌ సహకారంతో డాగ్‌ హ్యాండ్లర్‌ కానిస్టేబుల్‌ జి.వెంకట అప్పారావు శిక్షణ ఇచ్చారు. మాయ పతకం సాధించడంపై ఎస్పీ రాహుల్‌ మీనా, ఏఎస్పీ మహేంద్ర మత్తే, డీఎస్‌డబ్ల్యూఓ, ఆర్‌ఐ కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. శిక్షణ ఇచ్చిన వారిని అభినందించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో శిక్షణ పొందిన పోలీస్‌ డాగ్స్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌

పోటీలకు ఎంపిక

అయినవిల్లి: రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలకు అయినవిల్లి మండలం నల్లచెరువు జెడ్పీ హైస్కూలుకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యాన ఇటీవల పిఠాపురంలోని పీఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి జిల్లాల స్థాయి బాక్సింగ్‌ సెలక్షన్‌ పోటీలు జరిగాయి. ఇందులో అండర్‌–14 విభాగంలో మొగలి ఆదికేశవ్‌ (8వ తరగతి) 40–42 కిలోలు, సుంకర వీరసాయి సూర్యకిరణ్‌ (9వ తరగతి) 32–34 కిలోలు, గుత్తుల మహేష్‌ కృష్ణ 42–44 కిలోల విభాగాల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరు అక్టోబర్‌ 9 నుంచి 11వ తేదీ వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొంటారని పాఠశాల పీడీ పాయసం శ్రీనివాసరావు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంఈఓలు బండారు శేషగిరిరావు, పెచ్చెట్టి శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయురాలు వై.ఝాన్సీ నాగజ్యోతి, ఉపాధ్యాయులు, నల్లచెరువు గ్రామ పెద్దలు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement