అథ్లెటిక్స్‌లో మెహబూబ్‌ సిస్టర్స్‌కు పతకాలు | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌లో మెహబూబ్‌ సిస్టర్స్‌కు పతకాలు

Oct 1 2026 12:17 AM | Updated on Oct 1 2026 12:17 AM

అమలాపురం టౌన్‌: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇటీవల జరిగిన 44వ ఏపీ అంతర్‌ జిల్లాల మాస్టర్స్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో అమలాపురానికి చెందిన మెహబూబ్‌ సిస్టర్స్‌ షహీరా, షకీలాలు పలు పతకాలు సాధించారు. 75 ప్లస్‌లో షహీరా, 65 ప్లస్‌ వయస్సులో షకీలా ఈ పోటీల్లో తలపడ్డారు. షహీరా 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. లాంగ్‌ జంప్‌లో ద్వితీయ స్థానం సాధించి రజత, షాట్‌పుట్‌లో తృతీయ స్థానంతో కాంస్య పతకాలు అందుకున్నారు. మెహబూబ్‌ షకీలా హైజంప్‌, 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందేల్లో ప్రథమ స్థానాల్లో నిలిచి మూడు బంగారు పతకాలు దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement