సమర్థంగా పూర్తి చేయాలి ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

సమర్థంగా పూర్తి చేయాలి ‘సర్‌’

Oct 1 2026 12:17 AM | Updated on Oct 1 2026 12:17 AM

అమలాపురం రూరల్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను జిల్లాలో సమర్థవంతంగా పూర్తి చేయాలని ఎన్నికల అధికారులను జిల్లా ఎలక్ట్రోరల్‌ రోల్‌ పరిశీలకురాలు బి.నవ్య ఆదేశించారు. సర్‌ ప్రక్రియపై కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ వైఖోమ్‌ నైడియాదేవితో కలసి ఈఆర్‌ఓలతో కలెక్టరేట్‌లో బుధవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్‌ ప్రక్రియలో భాగంగా నమోదైన మొత్తం 57,902 కేసులకు సంబంధించి విచారణ పూర్తయిందని అధికారులు వివరించారు. అక్టోబర్‌ 12న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్‌ 10వ తేదీ వరకు వచ్చిన వివిధ దరఖాస్తులపై నవ్య సమీక్షించారు. ఫారం–6 కింద కొత్త ఓటరు నమోదుకు 1,462, ఫారం–6ఎ కింద 5, ఫారం–7 కింద 199, ఫారం–8 కింద 986 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు వివరించారు. ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల్లో ఫారం–8 దరఖాస్తుల తిరస్కరణ శాతంపై నవ్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు ఉండేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement