లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు

Oct 1 2026 12:17 AM | Updated on Oct 1 2026 12:17 AM

అమలాపురం రూరల్‌: ఆడపిల్లల పట్ల వివక్షను పూర్తిగా నిర్మూలించి, భ్రూణ హత్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రీ–కన్సెప్షన్‌, ప్రీ–నేటల్‌ డయాగ్నొస్టిక్‌ టెక్నిక్స్‌ (పీసీపీఎన్‌డీటీ) చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ వైఖోమ్‌ నైడియాదేవి ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన మాతాశిశు మరణాల జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కానింగ్‌ కేంద్రాలపై నిరంతరం తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. స్కానింగ్‌ కేంద్రాల్లో ఫారమ్‌–ఎఫ్‌ నమోదు, గర్భిణుల వివరాలు, స్కానింగ్‌ రికార్డులు, ఇతర పత్రాలను నిశితంగా పరిశీలించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న కేంద్రాలను గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అవసరమైతే సందర్భాల్లో డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సత్యనారాయణ, అడిషనల్‌ ఎస్పీ మహేంద్ర మత్తే తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement