అమలాపురం టౌన్: గోల్డ్ లోన్ అప్రైజర్ చార్జీలను 50 శాతం తగ్గిస్తూ చేసిన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు అమలాపురం గడియారం స్తంభం సెంటరులో శుక్రవారం సాయంత్రం నిరసన చేపట్టారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌వీ కొండలరావు తదితరులు మాట్లాడుతూ బ్యాంకు బంగారు ఆభరణాల పరిశీలన, నాణ్యత నిర్ధారణ, బరువు అంచనాలు వేసే బాధ్యతను తాము నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. పనిభారానికి అనుగుణంగా చార్జీలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. చార్జీలు నిర్ణయించే సమయంలో అప్రైజర్ల ప్రతినిధులతో చర్చించాలని సూచించారు. అనంతరం అమలాపురం ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్‌కు వారు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. యూనియన్ ప్రతినిధులు పూడి శ్రీనివాసరావు, ఎం.హరికృష్ణమాచారి, భరణికాన బాబు, లక్కోజు ప్రసాద్, బొల్లోజు కిరణ్, శ్రీరంగనాథ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


