కుష్ఠు వ్యాధిపై ఇంటింటి సర్వే | - | Sakshi
Sakshi News home page

కుష్ఠు వ్యాధిపై ఇంటింటి సర్వే

Sep 11 2026 8:16 AM | Updated on Sep 11 2026 8:16 AM

అమలాపురం రూరల్‌: జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కోసం ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎం.దుర్గారావు దొర తెలిపారు. సెప్టెంబర్‌ 11 నుంచి 24 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని గురువారం ఆయన వెల్లడించారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కుష్ఠు వ్యాధి అనుమానితులను గుర్తించనున్నట్టు చెప్పారు. అనుమానితులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా చికిత్స అందించనున్నట్టు తెలిపారు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, పూర్తిస్థాయి చికిత్స అందిస్తే వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు వైకల్యాలను నివారించవచ్చని చెప్పారు. ప్రజలు తమ ఇళ్లకు వచ్చే సర్వే సిబ్బందికి అవసరమైన సమాచారాన్ని అందించి, సర్వే విజయవంతానికి సహకరించాలని ఆయన కోరారు.

పర్యావరణ పునరుద్ధరణలో

స్థానిక భాగస్వామ్యం

అమలాపురం రూరల్‌: మడ అడవుల పునరుద్ధరణతో పాటు స్థానిక ప్రజల జీవనోపాధి మెరుగుదల దిశగా చేపట్టిన కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వైఖోమ్‌ నిడియా దేవి సూచించారు. గ్రీన్‌ కై ్లమేట్‌ ఫండ్‌ జీసీఎఫ్‌, ఈసీఆర్‌ఐసీసీ ప్రాజెక్టు కింద చేపడుతున్న కార్యక్రమాల పురోగతిపై గురువారం ఆమె సమీక్షించారు. కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయి అమలు, లబ్ధిదారుల ఎంపిక, శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ ఏడాది కార్యక్రమాలపై లక్ష్యాలు నిర్దేశించి నిర్ణీత వ్యవధిలో వాటిని పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో యుఎన్‌డీపీ ఇండియా ప్రోగ్రాం అనలిస్ట్‌ రాజత్‌ చౌదరి, స్టేట్‌ ప్రోగ్రాం మేనేజర్‌ సత్య శర్మ, స్టేట్‌ ప్రోగ్రాం అసోసియేట్‌ రవి కుమార్‌, జిల్లా కోఆర్డినేషన్‌ అసోసియేట్‌ ఎల్‌.హర్ష పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement