ధరలు తగ్గించాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

ధరలు తగ్గించాలని ధర్నా

Sep 11 2026 8:16 AM | Updated on Sep 11 2026 8:16 AM

అమలాపురం రూరల్‌: ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఽఆధ్వర్యంలో గురువారం అమలాపురం మండలపరిషత్‌ కార్యాయలం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ సభ్యుడు సత్తిబాబు మాట్లాడుతూ బ్లాక్‌ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సాధారణ మధ్యతరగతి ప్రజల దినసరి ఆదాయాలు తగ్గాయని, అసంఘటిత రంగ కార్మికుల వేతనాల్లో పెరుగుదల లేదని, దీంతో కొనుగోలు శక్తి సన్నగిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజలకు రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు ప్రభుత్వం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జి.వెంకటరమణ, కె.భీమరాజు, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement