ముగిసిన బాస్కెట్‌బాల్‌ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన బాస్కెట్‌బాల్‌ శిక్షణ

Sep 10 2026 12:15 AM | Updated on Sep 10 2026 12:15 AM

రామచంద్రపురం రూరల్‌: జాతీయ స్థాయి సబ్‌ జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ బాలికల జట్టు ఉచిత శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి ఈ విషయం తెలిపారు. బాలుర జట్టుకు ఈ నెల 11 వరకూ శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. శిక్షణ ముగింపు సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ, బాస్కెట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఽఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ శిక్షణ నిర్వహిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ కేవీఆర్‌ రాజు, ఎంపిక కమిటీ కార్యదర్శి అప్పలరాజు, శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ సలాది నాయుడు మాస్టారు, చెలికాని రామారావు, కోట సతీష్‌ కుమార్‌, కట్టా నాగేశ్వరరావు, కంచుమర్తి బాబూరావు, గొల్లపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement