బ్యాంకు ఉద్యోగిని
అదృశ్యంపై వీడని మిస్టరీ
ఆలమూరు: స్థానిక యూనియన్ బ్యాంకులో రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఆర్‌డీఓ)గా పనిచేస్తున్న వైఎస్సార్ కడప జిల్లా సింగారెడ్డిపల్లికి చెందిన గానుగపెంట సుప్రియ (28) కోసం గాలింపు చర్యలను ఆలమూరు పోలీసులు ముమ్మరం చేశారు. ఈనెల 17న చొప్పెల్ల లాకుల వద్ద స్కూటర్, తాళం, కళ్లజోడు, పాదరక్షలు వదిలి వెళ్లి తూర్పు డెల్టా ప్రధాన పంటకాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందని భావించిన పోలీసులు ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలియక అదృశ్యం కాస్త మిస్టరీగా మారింది. ఇప్పటికే సీసీ కెమెరాలు, డ్రోన్ల సాయంతో పరిశీలించినా సుప్రియ ఆచూకీ తెలియకపోవడంతో కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక ఎస్‌డీఆర్‌ఎఫ్ దళాలతో గాలిపు చర్యలను తీవ్రతరం చేశారు. అయినా ఆ యువతి ఆచూకీ కానరాక అంతటా ఆందోళన నెలకొంది. పంటకాలువలో దూకితే ఇప్పటికే మృతదేహం తేలాల్సి ఉందని గజ ఈతగాళ్లు చెబుతున్నారు.
వాడపల్లి వెంకన్న హుండీల
ఆదాయం రూ.2.97 కోట్లు
ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామికి హుండీల ద్వారా 35 రోజులకు రూ.2,97,95,990 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. గతంలో కంటే ఆదాయం గణనీయంగా పెరిగినట్లు గతంలో రోజుకు హుండీల ద్వారా రూ.7,93,823 ఉండగా ఇప్పుడు రోజుకు రూ.8,51,314 సరాసరి ఆదాయంగా లభించినట్లు తెలిపారు. కాగా వాడపల్లి ఆలయ ఆవరణలో ఆలయ హుండీలను బుధవారం దేవదాయ శాఖ పర్యవేక్షణ అధికారులు, జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ, రాజమహేంద్రవరం దేవదాయ శాఖ తనిఖీదారు ఎస్‌టీపీటీ శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈవోలు బి.కిరణ్(గోపాలపురం), మడికి గ్రూపు దేవాలయాల ఈవో ఎం.శివరామకృష్ణల సమక్షంలో లెక్కింపు నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారి ప్రధాన హుండీల ద్వారా విశ్వేశ్వరస్వామి హుండీలతో కలిపి రూ.1,81,93,365, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.1,16,02,625 రూపాయలు లభించాయన్నారు. అలాగే బంగారం 18.900 గ్రాములు, వెండి 1.24 కేజీలు, 15 దేశాలకు చెందిన 84 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని తెలిపారు. ఈ హుండీల ఆదాయ లెక్కింపులో ఆలయ ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు వాడపల్లి సుందర శేషావతారం, శిష్ట సూర్య కుటుంబరావు, త్రిమూర్తులు, సీహెచ్ సత్యనారాయణ, గ్రామస్తులు పి.వెంకన్న, వై.సుబ్బారావు, వై.వెంకటేశ్వరరావు, వై.వెంకన్న, ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, రావులపాలెం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచీల సిబ్బంది పాల్గొన్నారు.
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000
కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000
కురిడీ కొబ్బరి (పాతవి)
గండేరా (వెయ్యి) 27,000
గటగట (వెయ్యి) 24,000
కురిడీ కొబ్బరి (కొత్తవి)
గండేరా (వెయ్యి) 25,500
గటగట (వెయ్యి) 23,000
నీటికాయ
పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000
కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000
కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000
కిలో 350


