● ఉర్రూతలూగించిన ఎస్పీ శైలజ సినీ గీతాలు
తుని: శ్రీప్రకాష్ విద్యా సంస్థల వ్యవస్థాపక దినోత్సవాలు సంగీత స్వరాలు, విద్యార్థుల కేరింతల నడుమ బుధవారం ఘనంగా ముగిశాయి. విద్యాసంస్థలు ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ సంయుక్త కార్యదర్శి సీహెచ్.విజయ్‌ప్రకాష్ ఆధ్వర్యంలో గాతా రహే మేరా దిల్ కార్యక్రమానికి సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ ముఖ్య అతిథిగా హాజరై న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. తుని, పాయకరావుపేట, అన్నవరం, కాకినాడ, పెద్దాపురం, రాజమహేంద్రవరం శ్రీప్రకాష్ విద్యా సంస్థల విద్యార్థులు హాజరయ్యారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో విజేతలకు విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శైలజ పాడిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి. విద్యాసంస్థల తరఫున ఆమెను నరసింహారావు, రామసీత దంపతులు సత్కరించారు. డాక్టర్ నరేంద్రబాబు, ఎస్.సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల పూర్వ విద్యార్థులు 400 మంది రక్తదానం చేసినట్టు విజయప్రకాష్ తెలిపారు. 40 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన విద్యార్థులను ఆయన సత్కరించారు.


