అమలాపురం రూరల్: జిల్లాలో శక్తివంతమైన కొబ్బరి పీచు పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నామని, దీనికిగాను ఈ నెల 16, 17 తేదీల్లో అనాతవరం కన్వెన్షన్ హాల్‌లో ‘కోనసీమ క్వాయర్ కాంక్లేవ్’ పేరుతో రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. గురువారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో రెండో దఫా సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వచ్చే మూడు మాసాల్లో కనీసం 50 కొబ్బరి పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు. సదస్సుకు కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 15 మంది నిపుణులు, ఉన్నతాధికారులు విచ్చేసి రాయితీలు, ప్రభుత్వ పథకాలు, అత్యాధునిక సాంకేతికతపై అవగాహన కల్పిస్తారన్నారు. జేసీ వైఖోం నైదియాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఫ పాసర్లపూడి– దిండి జాతీయ రహదారి 216 వెంబడి 8 విద్యుత్ టవర్ల ఎత్తు పెంచే పనులు నెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ట్రాన్‌కో ఇంజినీర్లు రాజోలు, మామిడికుదురు తహసీల్దార్లు, జాతీయ రహదారుల ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు.
78 శాతం డిజిటలైజేషన్ పూర్తి
జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేలో భాగంగా 78 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తీరు తెన్నులపై సమీక్షించారు. ముసాయిదా ఓటరు జాబితా ఈ నెల 21న ప్రచురిస్తారని, కై ్లమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 20 వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచార వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.


