అభిరామ్‌కు రాష్ట్ర స్థాయి పురస్కారం
రామచంద్రపురం రూరల్: వినియోగదారుల సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేసిన మండలంలోని ద్రాక్షారామకు చెందిన దేవులపల్లి శ్రీకృష్ణ అభిరామ్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. వినియోగదారుల ఫోరం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విజిలెన్స్ కమిటీలో అభిరామ్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అభిరామ్ సేవలను అభినందిస్తూ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఇలక్కియ తదితరులు ఈ పురస్కారాన్ని అందజేశారు. అభిరామ్‌ను పలువురు అభినందించారు.


