వైఎస్ జగన్ వాలీబాల్ టోర్నీ విజేతగా వైజాగ్
అమలాపురం రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎ.వేమవరం గ్రామంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ జిల్లెళ్ల రమేష్ ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగిన వైఎస్ జగన్ వాలీబాల్ చాంపియన్ షిప్ విజేతగా వైజాగ్ జట్టు నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 32 జట్లు పోటీ పడగా, రన్నర్‌గా మాగం టీమ్ నిలిచింది. విజేతలకు వైఎస్సార్ సీపీ నాయకుడు కుంచే రమణారావు మొదటి బహుమతిగా రూ.25 వేల చెక్కు, ట్రోఫీ బహూకరించారు. రన్నర్‌కు మాజీ ఎంపీ, పార్టీ సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ రూ.15 వేల చెక్కు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు కుడిపూడి భరత్ భూషణం, రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు తొరం గౌతమ్, నాయకులు నక్కా చంద్రశేఖర్, చీకట్ల కిషోర్, చెట్ల రామారావు, చిత్రపు జయరాజు పాల్గొన్నారు.
విజేతకు ట్రోఫీ
అందజేస్తున్న
మాజీ ఎంపీ
అనురాధ,
వైఎస్సార్ సీపీ నాయకుడు
రమణారావు


