క్రిస్మస్ వెలుగులు
అమలాపురంలో మున్నా సిల్వర్ జూబ్లీ చర్చి
భూమిపై మానవులను పాపాల నుంచి రక్షించేందుకే ఏసుక్రీస్తు జన్మించారు. అశాంతితో ఉన్న సమాజాన్ని శాంతి, ప్రేమ, దయ తదితర మార్గాల్లో నడిపించారు. ప్రతి ఒక్కరూ పొరుగువారిని ప్రేమించాలని, క్షమాగుణం అలవర్చుకోవాలని బోధించారు. అనేక శ్రమలను భరించి శిలువపై మరణించారు. అనంతరం సజీవునిగా లేచి లోకానికి సత్యమార్గం చూపించారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. వివిధ చర్చిల్లో ఆయన జన్మవృత్తాంతాన్ని తెలుపుతూ వేసిన సెట్టింగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి క్రిస్మస్ పండగ సందడి మొదలైంది. చర్చిలు, క్రైస్తవుల ఇళ్లు రంగురంగుల విద్యుద్దీపాలతో కాంతులీనుతున్నాయి.
రామచంద్రపురంలోని దివ్య కారుణ్య దేవాలయంలో క్రీస్తు జననాన్ని తెలిపే సెట్టింగ్
క్రిస్మస్ వెలుగులు


