వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి
అమలాపురం టౌన్: వీఆర్వోల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర సంఘం ప్రచార కార్యదర్శి, జిల్లా గౌరవాధ్యక్షుడు మద్దాల బాపూజీ డిమాండ్ చేశారు. అమలాపురంలోని కచేరి చావిడిలో మంగళవారం జరిగిన జిల్లా వీఆర్వోల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు సాధనాల ఎల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ నెల 19న విజయవాడలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌కు వీఆర్వోలకు సంబంధించిన అనేక సమస్యలను వివరించామన్నారు. గ్రేడ్–2 వీఆర్వోలకు గ్రేడ్–1గా పదోన్నతులు కల్పించాలని, వన్ టైమ్ సెటిల్మెంట్ పద్ధతిలో పదోన్నతులకు అర్హులైన వీఆర్వోలను ఖాళీల్లో భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి మల్లేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు రుద్రరాజు సత్యనారాయణరాజు, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కొప్పిశెట్టి గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఈవీవీ సత్యనారాయణ, కేవీవీ సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి చోడే శివకుమార్ తదితరలు ప్రసంగించారు.


