
నిరీక్షణకు తెర..
కేటగిరీ అఽభ్యర్థి మార్కులు ర్యాంకు
ఎస్‌ఏ ఇంగ్లిష్ అమలకట్ట వరప్రసాద్ 86.46 1
గొలగాని రాంబాబు 84.38 2
నిడదవోలు రాజరాజేశ్వరి 83.96 3
ఎస్‌ఏ హిందీ లక్ష్మి చిక్కం 84.94 1
దడాల దుర్గాప్రసాద్ 82.73 2
నేతల నేత్రిఅపర్ణ 81.05 3
ఎస్‌ఏ సంస్కృతం ఆకాశం గౌరీష్‌బాబు 69.93 1
బి.వెంకట సుబ్రహ్మణ్యం 65.57 2
గొర్తి వెంకటశాస్త్రి 60.67 3
ఎస్‌ఏ తెలుగు విత్తనాల వంశీకృష్ణ 90.35196 1
వేదాంతం నరసింహాచారి 86.95051 2
కట్టా సత్య హరీష్ 86.88907 3
ఎస్‌ఏ బీఎస్ వర్రివీఎస్ సన్యాసినాయుడు 88.95280 1
కె.వెంకటరెడ్డి 85.53268 2
గెడ్డం వెంకటశివప్రసాద్ 84.19761 3
ఎస్‌ఏ మ్యాథ్స్ పక్కుర్తి రామకృష్ణ 87.1662 1
బేతా ఆర్‌వీవీ సత్యవేణి 87.32963 2
మామిడి రాంబాబు 85.83529 3
ఎస్‌ఏ పీఈ కడిమిశెట్టి అశోక్ 89.5 1
కొల్లు శివకుమార్ 89 2
కలిగితి మణికృష్ణ 87.5 3
ఎస్‌ఏ పీఎస్ యనమల పంప ప్రసాద్ 85.43 1
తెడ్లపు లీలా శివజ్యోతి 84.14 2
శివఅమ్మిరాజు చల్లా 83.74 3
ఎస్‌ఏ సోషల్ పెద్ది గంగానారాయణ 89.83884 1
సంకాబత్తుల అన్నపూర్ణ 87.00550 2
జామిశెట్టి సత్యాదేవి 85.94379 3
ఎస్జీటీ తెలుగు వడగల సూర్యలక్ష్మి 94.56377 1
కడలి రాజ్‌కిరణ్ 93.91215 2
గాయత్రి తోలేటి 93.50426 3
ఫ ఎట్టకేలకు డీఎస్సీ–2025 మెరిట్ లిస్ట్ ప్రకటన
ఫ కటాఫ్ మార్కులపై సర్వత్రా చర్చ
ఫ ఈ నెల 25న సర్టిఫికెట్ల వెరిఫికేషన్?
రాయవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన డీఎస్సీ–2025 ఫలితాలను శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మహిళలే పైచేయి సాధించడం గమనార్హం. ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌లో పోస్టులు, జోన్ల వారీగా మెరిట్ జాబితాను పొందుపర్చారు. అందులో మొత్తం 60 కేటగిరీల పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్టులను ఉంచారు.
ర్యాంకులు సాధించిన అభ్యర్థులు లెక్కల్లో మునిగి తేలుతున్నారు. తమకు వచ్చిన ర్యాంకుకు ఉద్యోగం వస్తుందా? రాదా? అనే మీమాంసను వారు ఎదుర్కొంటున్నారు. పోస్టుల సంఖ్య ఆధారంగా ఓపెన్ కేటగిరీలో ఏ ర్యాంకు వరకూ ఉద్యోగం వస్తుంది.. అలాగే వివిధ రిజర్వేషన్ కేటగిరీల్లో మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకూ పోస్టుల ఆధారంగా లెక్కలు వేసుకుంటున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తమకు చాన్స్ వస్తుందా? రాదా? అనే లెక్కల్లో మునిగి తేలుతున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 1:1 నిష్పత్తిలో మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులను పిలిచే అవకాశముంది. ఈ నెల 25వ తేదీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ ఇంజినీరింగ్ కళాశాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
మహిళలదే పైచేయి
డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌కు ముందు నుంచే ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యారు. డీఎస్సీకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా? అని ఎదురుచూపులు చూసిన అభ్యర్థులు కాకినాడ, రాజమహేంద్రవరం, కృష్ణా జిల్లా అవనిగడ్డ వంటి ప్రాంతాల్లో డీఎస్సీ పరీక్షకు కోచింగ్ తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉపాధ్యాయ కొలువు సాధించాలనే పట్టుదలతో సన్నద్ధమయ్యారు. ఈ పరీక్షల్లో వివిధ కేటగిరీ పోస్టులకు మహిళలే ఉత్తమ ర్యాంకులు సాధించడం గమనార్హం. ఉదాహరణకు మొదటి 150 ర్యాంకుల్లో 90 మంది మహిళలే కావడం విశేషం. అలాగే అన్ని కేటగిరీ పోస్టుల్లో కూడా మహిళలే అధికంగా ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఎస్‌ఏ ఇంగ్లిష్‌లో మొదటి 23 ర్యాంకుల్లో 13 మంది మహిళలు ఉన్నారు.
మొత్తం 1,241 పోస్టులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ/ఎంపీపీ, మున్సిపల్ మేనేజ్‌మెంట్ల పరిధిలో 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎస్జీటీ పోస్టులు 423 కాగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 818 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో అధికంగా ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత సోషల్, బయాలజీ పోస్టులు ఖాళీలు అధికంగా ఉన్నాయి. మిగిలిన సబ్జెక్టులు కేవలం రెండంకెల్లో ఉన్నాయి. ట్రైబుల్ వెల్ఫేర్ విభాగంలో ఎస్‌ఏ (పీఎస్)–3, ఎస్‌ఏ (బీఎస్)–4, ఎస్‌ఏ (పీఈ)–1, ఎస్జీటీ పోస్టులు 104 ఖాళీలు ఉన్నాయి.
ఇవి కాకుండా జోన్–2 పరిధిలో ఏపీ రెసిడెన్షియల్, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్/ట్రైబుల్ (గురుకులం) యాజమాన్య పాఠశాలల్లో 348 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో పీజీటీ–49, టీజీటీ–272, పీడీ–3, పీఈటీ–24 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో
అన్ని విభాగాల్లో ఖాళీలు
కేటగిరి ప్రభుత్వ/జెడ్పీ/
మున్సిపల్ మేనేజ్‌మెంట్లు
ఎస్జీటీ 423
ఎస్‌ఏ తెలుగు 65
ఎస్‌ఏ హిందీ 78
ఎస్‌ఏ ఇంగ్లిష్ 95
ఎస్‌ఏ గణితం 64
ఎస్‌ఏ పీఎస్ 71
ఎస్‌ఏ బయాలజీ 103
ఎస్‌ఏ సోషల్ 132
ఎస్‌ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 210