శిల్పి వుడయార్‌కు డాక్టరేట్‌ ప్రదానం | - | Sakshi
Sakshi News home page

శిల్పి వుడయార్‌కు డాక్టరేట్‌ ప్రదానం

Aug 24 2025 8:29 AM | Updated on Aug 24 2025 8:29 AM

శిల్ప

శిల్పి వుడయార్‌కు డాక్టరేట్‌ ప్రదానం

కొత్తపేట: శిల్పకళా రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్‌ వుడయార్‌కు చైన్నె గ్లోబల్‌ హ్యూమన్‌ పీస్‌ యూనివర్సిటీ (జీహెచ్‌పీయూ) శనివారం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. కొత్తపేటకు చెందిన శిల్పి రాజ్‌కుమార్‌ వేలాదిగా వివిధ రకాల శిల్పాలు రూపొందించారు. ఆయన తయారు చేసిన అనేక శిల్పాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెలకొల్పారు. తన తండ్రి శ్రీనాథరత్నశిల్పి వుడయార్‌ పేరుతో శిల్పకళా సాంస్కృతిక సేవా సంస్థ, వుడయార్‌ ఫైన్‌ఆర్ట్స్‌ స్థాపించి వాటి ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ విధంగా రాజ్‌కుమార్‌ ప్రతిభ, సేవలను గుర్తించిన జీహెచ్‌పీయూ చైన్నె భారతీయ విద్యా భవన్‌లో జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ (డాక్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌)ను యూనివర్సిటీ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ డాక్టర్‌ పి.మాన్యూల్‌ ఆధ్వర్యంలో వైస్‌ చాన్సిలర్‌ డాక్టర్‌ కె.వెంకటేషన్‌ తదితర ప్రముఖుల చేతుల మీదుగా ప్రదానం చేశారు.

సందీప్‌ ట్రస్ట్‌ చైర్మన్‌కు..

కొత్తపేట: సందీప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ బండారు పెదవెర్రియ్య (చిట్టిబాబు)కు చైన్నె గ్లోబల్‌ హ్యూమన్‌ పీస్‌ యూనివర్సిటీ (జీహెచ్‌పీయూ) సేవారత్న పురస్కారంతో పాటు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. వాడపాలెం గ్రామానికి చెందిన చిట్టిబాబు తనయుడు సందీప్‌ వైద్య విద్య అభ్యసిస్తూ మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులు సత్యవేణి, చిట్టిబాబు దంపతులు తనయుడు, దివంగత వైద్య విద్యార్థి సందీప్‌ స్మృతిలో ఉచిత వైద్య శిబిరాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. స్వగ్రామం వాడపాలెంలో శాశ్వతంగా సందీప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవా భవనాన్ని నిర్మించారు. దాని ద్వారా తరచూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ విభాగాల ప్రముఖ వైద్యుల సహకారంతో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. చిట్టిబాబు సేవలను గుర్తించి పురస్కారం ప్రదానం చేశారు.

ఎరువుల సరఫరాలో కూటమి వైఫల్యం

వైఎస్సార్‌ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్‌

అమలాపురం టౌన్‌: రైతులకు నాణ్యమైన ఎరువులను సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రసుత్తం యూరియా కొరత అధికంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. శనివారం అమలాపురంలో కిషోర్‌ శ్రీసాక్షిశ్రీతో మాట్లాడారు. గత ఖరీఫ్‌ కంటే ఎక్కువగా ఎరువులను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం అంకెల గారడీతో కొన్ని వేల టన్నులు అందుబాటులో ఉన్నాయని ప్రచారం చేస్తోందన్నారు. ఇది ప్రచార ఆర్భాటమే తప్ప రైతులకు క్షేత్ర స్థాయిలో యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నా అరికట్టే ప్రయత్నం చేయలేదన్నారు. యూరియాను దళారులు స్టాక్‌ చేయకుండా, అధిక ధరలకు అమ్మకుండా నియంత్రించాలన్నారు. యూరియా కొరత సృష్టిస్తున్న దళారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. విజిలెన్స్‌ అధికారులతో తనిఖీలు, దాడులు చేయించాలని కిషోర్‌ అన్నారు.

శనైశ్చరునికి ప్రత్యేక పూజలు

కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శనికి ప్రీతికరమైన శనివారం పురస్కరించుకుని దేవదాయ – ధర్మదాయ శాఖ ఉప కమిషనర్‌, దేవస్థానం నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. ముందుగా ప్రాతఃకాల సమయంలో ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిన అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భక్తుల పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.3,12,790, అన్నప్రసాదం విరాళాలుగా రూ.52,960 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు.

శిల్పి వుడయార్‌కు  డాక్టరేట్‌ ప్రదానం 1
1/2

శిల్పి వుడయార్‌కు డాక్టరేట్‌ ప్రదానం

శిల్పి వుడయార్‌కు  డాక్టరేట్‌ ప్రదానం 2
2/2

శిల్పి వుడయార్‌కు డాక్టరేట్‌ ప్రదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement