
సాంకేతికమక
అమలాపురం టౌన్: రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న స్లాట్ బుక్కింగ్‌లో తరచూ సర్వర్ పనిచేయక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆస్తుల అమ్మకం, కొనుగోలుదారుల కష్టాలు మరింత ఎక్కువ అయ్యాయి. స్లాట్ బుక్ చేసుకోవడంలో, ఓటీపీలు రావడంలో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ నిర్వహించే సర్వర్ పనిచేయకపోవడంలో తరుచూ ఎదురయ్యే సాంకేతిక సమస్యలే క్రయ విక్రయదారులకు కష్టాలకు కారణమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం సర్వర్ సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది.
జిల్లాలో 15 కార్యాలయాలు
జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నా యి. 2.0 విధానంలో జిల్లా కేంద్రంలో అమ లాపురం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రోజుకు 78 స్లాట్లు, మిగిలిన రిజిస్ట్రార్ కార్యాలయాలకు 34 స్లాట్లకు ఆ శాఖ పరిమితి విధించింది. స్లాట్ బుక్ చేసుకుంటే సూచించిన సమయానికి క్రయ, విక్రయదారులు వస్తే పావు గంటలో రిజిస్ట్రేషన్ తంతు పూర్తవుతుంది. అతి తక్కువ సయయంలో రిజిస్ట్రేషన్ పూర్తవడమే కాకుండా గంటల తరబడి వేచి ఉండాల్సిన పని ఉండదు.
సర్వర్ సమస్యలు
ఆస్తుల రిజిస్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నాక ఫలానా సయయానికి రిజిస్ట్రార్ కార్యాలయానికి రావాలని ఫోన్‌కు మేసేజ్ వస్తుంది. తీరా ఆ సమాయానికి క్రయ విక్రయదారులు వెళితే నర్వర్ పనిచేయక బుక్ చేసిన స్లాట్ సమయం దాటిపోయి అది సహకరించడంలేదు. అప్పటికే డేటా ఎంట్రీకి చెల్లించిన రూ.600 ఫీజు వృథా అవుతోంది. రీ షెడ్యూలుకు అవకాశం లేకుండా స్లాట్ మళ్లీ బుక్ చేసుకోవాలని సూచించడంతో క్రయ విక్రయదారులు మళ్లీ రూ.600 వెచ్చింది మళ్లీ డేటా ఎంట్రీ చేస్తున్నారు. దీని వల్ల అదనపు ఖర్చుతో పాటు సమయానికి రిజిస్ట్రేషన్ కాకపోవడంతో గంటల తరబడి లేదా రోజంతా అక్కడే పడిగాపులు కాయాల్సివస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతోంది. క్రయ విక్రయదారుల జేబులకు మాత్రం చిల్లులు పడుతున్నాయి.
ఓటీపీల అవస్థలు
స్లాట్ బుక్ చేసుకున్నాక ఆస్తుల కొనుగోలుదారులకు 4 సార్లు, అమ్మకందార్లకు 2 రెండు సార్లు వారి సెల్ ఫోన్లకు ఓటీపీలు వస్తాయి. ఆ ఓటీపీలను రిజిస్టేషన్ సిబ్బందికి వెను వెంటనే క్రయ విక్రయదారులు చెప్పాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ ఓటీపీల విధానంతో క్రయవిక్రయదారులు అనేక అవస్థలకు గురవుతున్నారు. సర్వర్ సమస్యతో సకాలంలో ఓటీపీలు రాక ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్దే ఎదురు చూపులు చూడాల్సి వస్తోంది. ఆన్‌లైన్ డేటాలో అమ్మకందారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ ద్వారా డేటా ఫిల్ అవుతుంది. గతంలో ఓటీపీలతో నిమిత్తం లేకుండా మాన్యువల్ డేటాను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉండేది. ఒక గంట సేపు సర్వర్ సమస్యతో రిజిస్టేషన్ ప్రక్రియ స్తంభిస్తే జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఇప్పటికై నా రాష్ట్ర రిజిస్టేషన్ శాఖ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సర్వర్ సమస్యను పరిష్కరించి స్లాట్ బుక్కింగ్, ఓటీపీల ఇబ్బందులను తొలగించాలి. లేని పక్షంలో క్రయ విక్రయదారుల విలువైన సమయాన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఎదురుచూపులతో వృథా చేసినట్లే అవుతుంది.
స్లాట్‌కు టెక్నికల్ సమస్యలు
సకాలంలోని రాని ఓటీపీలు
ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు అవాంతరాలు
సర్వర్ పనిచేయక
ముందుకు సాగని రిజిస్ట్రేషన్ ప్రక్రియ
క్రయవిక్రయదారుల అవస్థలు
అదనపు ఖర్చు
అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు రోజుల క్రితం సర్వర్ సమస్యతో బుక్ చేసిన స్లాట్లు సాంకేతికంగా ఫెయిలై, పది పార్టీలు (క్రమ విక్రయదారులు) మళ్లీ రూ.600 అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజూ సర్వర్ సమస్యతో స్లాట్ల బుకింగ్‌ల్లో, ఓటీపీ రావడంలోనూ ఇబ్బందులు కలుగుతున్నాయి.