
విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుందాం
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు
అమలాపురం టౌన్: ఉక్కు పరిశ్రమను కాపాడుకుందామని, ఇందుకో సం తాజాగా నిర్వహించనున్న ప్రజా ఉద్యమ నిర్మాణంలో భాగస్వాములు అవుదామని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు పిలుపు నిచ్చారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శాసన మండలి పార్టీ ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ చేపట్టే ప్రజా ఉద్యమాలకు అందరం సిద్ధమవుదామన్నారు. అమలాపురం హైస్కూల్ సెంటర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్య మంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర బీజేపీ నాయకులు తొలి నుంచి విశాఖ ఉక్కును కాపాడుతున్నామని చెప్పి, రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతూ వచ్చి నేడు ప్రైవేటీకరణకే సిద్ధమైందన్నారు. 2021 జనవరి 21న విశాఖ ఉక్కు పరిశ్రమను నూరుశాతం విక్రయించాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తు చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు తెర వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు అడుగులు వేస్తూనే.. రాష్ట్ర ప్రజలకు మాత్రం ఈ పరిశ్రమ విషయంలో అడుగడుగునా అన్యాయం చేస్తూనే ఉన్నారన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని వైఎస్సార్ సీపీ చేయబోయే ఉద్యమంలో పార్టీ ఎమ్మెల్సీలందరం భాగస్వాములు అవుతామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ నాయకులు దండుమేను రూపేష్, కుడుపూడి త్రినాథ్, ముంగర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భూమి హక్కుల నిర్ధారణకే
స్వామిత్వ సర్వే
అమలాపురం రూరల్: గ్రామాలలో నివసించే ప్రజలకు వారి భూమి హక్కులను నిర్ధారించడానికి, సరిహద్దులను గుర్తించడానికి స్వామిత్వ సర్వే చేపట్టినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రెండో దశ స్వామిత్వ సర్వేపై డిజిటల్, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, విలేజ్ సర్వేయర్లు, వీఆర్వోలతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తులకు డిజిటల్ రికార్డులు సృష్టిం చడం ద్వారా ఆస్తి రికార్డులపై స్పష్టత వస్తుందన్నారు. దీనివల్ల ఆస్తి హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు తలెత్త కుండా ఉంటాయన్నారు. వాటిని అమ్మడం, కొనడం, పెట్టుబడులు పెట్టడం వంటి ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. డ్రోన్ సర్వే పూర్తయిన తర్వాత డిజిటల్ మ్యాప్‌ను గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజల సమక్షంలో తనిఖీ చేస్తారని, ఎవరికై నా తమ ఆస్తి సరిహద్దుల గురించి అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చన్నారు.
విద్యార్థుల కెరీర్
గైడెన్స్‌పై కార్యాచరణ
అమలాపురం రూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తయిన వెంటనే విద్యార్థులు కెరీర్ గైడెన్స్ ద్వారా ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోవడంపై అవగాహనకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. మామిడికుదురు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు చిరంజీవి, పూర్వపు విద్యార్థి నవీన్ రూపొందించిన కెరీర్ గైడెన్స్ వృక్షాన్ని, 12 ట్రేడులలో శిక్షణ ప్రణాళిక, 52 కోర్సులలో ఎంపికపై పోస్టర్లు, బ్రోచర్లు తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆసక్తి అనుగుణంగా వివిధ రకాల కోర్సులను ఎంచుకుని, జీవితంలో స్థిరపడాలన్నారు.
● ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి, వాటిని అధిక ధరలకు అమ్మడం నేరమని కలెక్టర్ అన్నారు. అలా చేసే ప్రైవేట్ డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుందాం

విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుందాం