
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
జైకొట్టి.. జెండా చేతపట్టి
సాక్షి, అమలాపురం: పైరు పచ్చని సీమ మువ్వన్నెల జెండాలతో కొత్త అందాలను సంతరించుకుంది.. స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు కావడంతో అందరిలో దేశభక్తి ఉప్పొంగింది.. జైకొట్టి, జెండా చేతపట్టి ప్రతి హృదయం ఉప్పొంగింది.. జిల్లాలో శుక్రవారం స్వాతంత్య్ర దిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. చిన్నారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువకులు, వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలతో వేడుకల్లో పాల్గొని తమ దేశభక్తిని చాటారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో జరిగిన జిల్లా వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్‌సీసీ, స్కౌట్ విద్యార్థుల, త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శాంతి కపోతాలను ఎగుర వేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. జిల్లా వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. ఈ వేడుకలకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నిషాంతి, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, డీఆర్వో కొత్తా మాధవి, ఆర్డీఓలు పి.శ్రీకర్, డి.అఖిల హాజరయ్యారు.
మూడు రంగులతో నీటిని
వెదజల్లుతున్న అగ్నిమాపక శకటం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో
విద్యార్థుల విన్యాసం
సిందూర్‌ను ప్రతిబింబించేలా..
స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌ను గుర్తు చేస్తూ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చేసిన దేశభక్తి గేయాల నృత్య రూపకంలో ఆపరేషన్ సిందూర్ ఇతివృత్తాంతంగా తీసుకున్నారు. దేశభక్తి పాటలు, నృత్య రూపకాలతో విద్యార్థులు ఆహుతుల నుంచి హర్షధ్వానాలు పొందారు. వీటితో పాటు పీ–4, అన్న క్యాంటీన్ల నిర్వహణ, వాట్సాప్ గవర్నెన్స్, అన్నదాత సుఖీభవ– పీఎం కిసాన్, తల్లికి వందనం కార్యక్రమాలపై సాంస్కృతిక, గేయ, నృత్య ప్రదర్శలు నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మొదటి స్థానంలో నిలవగా, ఇరుసుమండ సైంట్‌జోసెఫ్ స్కూల్ ద్వితీయ, అమలాపురం బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మూడో స్థానంలో నిలిచాయి. పోలీసులు నిర్వహించిన కవాతు, అగ్నిమాపక వాహనం త్రివర్ణ రంగులతో కూడిన నీటిని వెదజల్లి ఆకట్టుకున్నారు.
ఫ జిల్లాలో మురిసిన మువ్వన్నెల జెండా
ఫ ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు
ఫ అమలాపురంలో
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
ఫ ఉత్తమ అధికారులకు
పురస్కారాల ప్రదానం

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025