
సాంకేతికత వినియోగించాలి
అమలాపురం టౌన్: నేర పరిశోధనలో సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ కేసులను ఛేదించాలని ఎస్పీ బి.కృష్ణారావు పోలీసు అధికారులకు సూచించారు. జిల్లాలో ప్రతీ కూడలిలో ప్రజా భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను ఆయన మాట్లాడారు. జిల్లా ఏఎస్పీ ఏవీఆర్ పీబీ ప్రసాద్‌తోపాటు రామచంద్రపురం, కొత్తపేట డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఈ సమీక్షలో పాల్గొని నేర పరిశోధన పరంగా సాధించిన కేసుల వివరాలను వెల్లడించారు. పోలీస్ సబ్ డివిజన్, పోలీస్ సర్కిల్, పోలీసు స్టేషన్ల వారీగా నేర సమీక్షపై చర్చ జరిగింది. జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించేలా పోలీసు విచారణలు, దర్యాప్తులు పకడ్బందీగా సాగాలని ఎస్పీ సూచించారు. ఇప్పటికే జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధుల్లో చాలా వరకూ సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయని, అయితే ఈ వ్యవస్థను మరింత విస్తరించాలన్నారు. నేర పరిశోధనలకు అనుచరించాల్సిన సాంకేతికతపై ఎస్పీ పలు సూచనలు ఇచ్చారు. చోరీలు, రికవరీలపై చర్చించారు. కొత్తపేట, రామచంద్రపురం డీఎస్పీలు సుంకర మురళీ మోహన్, బి.రఘువీర్, ఆర్మ్‌డ్ డీఎస్పీ సుబ్బరాజు, స్పెషల్ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్‌బీ సీఐ వి. శ్రీనివాస్ పాల్గొన్నారు.
జిల్లా నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ కృష్ణారావు