పోలేరమ్మ తల్లికి వెండి కిరీటం | - | Sakshi
Sakshi News home page

పోలేరమ్మ తల్లికి వెండి కిరీటం

Mar 18 2025 12:10 AM | Updated on Mar 18 2025 12:11 AM

ఆలమూరు: పెదపళ్ల గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారికి దాతలు రూ.2.7 లక్షలతో వెండి కిరీటం తయారు చేయించి, సోమవారం సమర్పించారు. ఈ కిరీటానికి తొలుత గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రెండున్నర కిలోల బరువైన ఈ వెండి కిరీటాన్ని అమ్మవారికి అర్చకులు అలంకరించారు. గ్రామానికి చెందిన జాస్తి సుబ్బన్న, లక్ష్మీ నరసమ్మ, సూరన్న, సత్యవతి, శ్రీరాములు, సూరమ్మ దంపతులు, వారి వారసులు కలిసి ఈ కిరీటాన్ని తయారు చేయించారు. కార్యక్రమంలో జాస్తి వెంకటేశ్వరరావు, జాస్తి భాస్కరరావు, దాసరి శారదాదేవి, జాస్తి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement