నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ మేలు జరగాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
జగ్గిరెడ్డి ఆకాంక్ష
కొత్తపేట: ఆంగ్ల నూతన సంవత్సరంలో కొత్తపేట నియోజకవర్గంతో పాటు జిల్లాలో రైతులు, ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని, శాంతి, సమానత్వంతో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలని స్థానిక మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆకాంక్షించారు. 2025 వ సంవత్సరం గడచి 2026 సంవత్సరంలో అడుగిడుతున్న వేళ ఆయన జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండాలని పేర్కొన్నారు. యువత ఉజ్వల భవిష్యత్, కొత్త అవకాశాలు, నూతన లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరంలో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతమవుతుందని నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు పార్టీ అభివృద్ధికి బాధ్యతతో, మరింత కష్టపడి పని చేయాలని కోరారు.


