పొగాకు బ్యారన్లు, పాకలు దగ్ధం
సీతానగరం: మండలంలోని కాటవరంలో నాలుగు పొగాకు బ్యారన్లు, మూడు రెల్లుగడ్డి పాకలకు అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం కాటవరం పెట్రోల్ బంకు దగ్గరలో సాయంత్రం 5 గంటలకు చిట్టూరి వరప్రసాద్, పోలిన ప్రకాశం, చిట్టూరి వీర్రాజులకు చెందిన పొగాకు బ్యారన్‌లలో వర్జీనియా పొగాకు క్యూరింగ్ జరుగుతుండగా, ప్రమాదవశాత్తు బ్యారన్‌లో గొట్టాలపై ఆకులు పడి అగ్ని ప్రమాదం జరిగింది. దానితో నాలుగు బ్యారన్లు, మూడు పాకలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బ్యారన్లలో ఉన్న పొగాకు, ములకలకర్రలు, బాజులు, అలాగే రెల్లుగడ్డి పాకల్లో ఉంచిన పొగాకు బేళ్లు కాలిపోయాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులు ఇళ్ల వద్ద ఉన్న మోటార్లు వేసి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. రాజమహేంద్రవరం నుంచి రెండు అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.


