108 కిలోల విబూదితో శివయ్యకు అభిషేకం | - | Sakshi
Sakshi News home page

108 కిలోల విబూదితో శివయ్యకు అభిషేకం

Nov 20 2024 12:15 AM | Updated on Nov 20 2024 12:15 AM

108 కిలోల విబూదితో శివయ్యకు అభిషేకం

108 కిలోల విబూదితో శివయ్యకు అభిషేకం

గండేపల్లి: మండలంలోని ఉప్పలపాడులో ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం 108 కిలోల విబూదితో స్వామి వారిని అభిషేకించారు. ఆలయ పురోహితులు చంద్రమౌళి సుబ్బారావు శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

శతాధిక వృద్ధుడి మృతి

జగ్గంపేట: స్వాతంత్య్రోద్యమం నుంచి కూడా రాజకీయాలలో తిరుగుతూ ప్రముఖ నేతల వెంట నడిచిన శతాధిక వృద్ధుడు బూరా చిన అప్పారావు సోమవారం రాత్రి మృతి చెందారు. జగ్గంపేట అంబేద్కర్‌ నగర్‌కు చెందిన అప్పారావు 1907లో జన్మించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసుత్తం అప్పారావుకు 116 సంవత్సరాలు అని కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో కూతురు బి.సరోజిని వద్ద ఇంటి వద్ద ఉంటున్నారని వారు తెలిపారు. ఆయన మృతికి స్థానిక నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.

ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం

కాకినాడ క్రైం: కాకినాడ నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల అదృశ్యంపై టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గైగోలుపాడు, శాంతినగర్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థినులు మంగళవారం కళాశాలకు వచ్చి, అక్కడి నుంచి సర్పవరంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎంటి మాల్‌కు వెళ్లారు. ఓ వ్యక్తి ఫోన్‌ తీసుకుని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తాము సమీపంలో దేవాలయానికి వెళుతున్నామని చెప్పారు. ఆ తర్వాత వారి జాడ తెలియరాలేదు. రాత్రి గడిచినా ఇంటికి చేరకపోవడంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూ టౌన్‌ సీఐ మజ్జి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విద్యార్థినుల కోసం గాలిస్తోంది.

25 వరకూ దూర విద్య అడ్మిషన్లు

నల్లజర్ల: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈనెల 25 వరకూ టెన్త్‌, ఇంటర్‌లకు తత్కాల్‌ అడ్మిషన్లు చేసుకోవచ్చని దూబచర్ల స్టడీ సెంటర్‌ కో–ఆర్డినేటర్‌ అంబటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయాన్ని ఆసక్తిగల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement