
చేపల వేటపై పది రోజుల్లో నిర్ణయం
కలెక్టర్ మహేష్‌కుమార్
అమలాపురం రూరల్: మత్స్యకార ప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులతో చర్చించి, పది రోజుల్లో సముద్ర తీర ప్రాంతంలో చేపల వేట పరిమితులపై ఆమోదయోగ్య నిర్ణయం ప్రకటిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారుల సముద్రపు వేట సమస్యలపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో మత్స్యకార సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌ను కలిశారు. స్వేచ్ఛగా చేపల వేట సాగించే అవకాశం కల్పించాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు 63 స్కిల్ ట్రేడ్స్‌లో ఇండియాస్ స్కిల్ కాంపిటీషన్స్–2025 నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఏపీ నైపుణ్యం పోర్టల్‌లో సెప్టెంబర్ 30లోగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. ఈ పోస్టర్‌ను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ.హరిశేషు, ఏడీఎస్‌డీవో నాగబాబు, పీవో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
భద్రతా చర్యలు పాటించాలి
గణపతి నవరాత్ర ఉత్సవాలను జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు, మండప నిర్వాహకులు భద్రత చర్యలను తప్పనిసరిగా పాటించాలన్నారు. మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాల నుంచి అనధికారికంగా కనెక్షన్లు తీసుకోరాదని స్పష్టం చేశారు. యాత్ర, నిమజ్జనం సమయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరగ కుండా సురక్షిత ప్రదేశాలను ఎంచుకోవాలన్నారు. మండపాల వద్ద అగ్నిమాపక పరికరం అందుబా టులో ఉంచాలన్నారు. అత్యవసర ఫోన్‌నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రా త్రి 10 తర్వాత మైకులు వాడకుండా చూడాలన్నా రు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలన్నారు. వినాయక మట్టి ప్రతిమలను కలెక్టర్‌తో పాటు, జేసీ నిషాంతి, డీఆర్వో మాధవి, ఏవో కాశీవిశ్వేశ్వరరావు అధికారులకు పంపిణీ చేశారు.