
పోరాటం ఉధృతం
తక్షణం ప్రభుత్వం పీఆర్‌సీని ఏర్పాటు చేయాలి. అలాగే ఐ.ఆర్ ప్రకటించి, కనీసం రెండు డీఏలను ఇవ్వాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల విషయంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ విషయంలో కలిసొచ్చే సంఘాలతో ఉమ్మడి కార్యాచరణ చేపడతాం.
–పి.సురేంద్రకుమార్,
కోనసీమ జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్
అభద్రతా భావం
ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్ఫథంతో వ్యవహరించాలి. పీఆర్‌సీ ఏర్పాటు, ఐ.ఆర్ ప్రకటన, డీఏల ప్రకటన విషయంలో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఇలాగే కొనసాగితే ఉద్యోగుల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. ఎంతటి పోరాటానికై నా ఎస్‌టీయూఏసీ, ఫ్యాఫ్టో తరఫున సిద్ధంగా ఉన్నాం.
–పోతంశెట్టి దొరబాబు, కోనసీమ జిల్లా అధ్యక్షుడు,
ఎస్టీయూ, ప్రధాన కార్యదర్శి ఫ్యాఫ్టో
మాట నిలుపుకోవాలి
కూటమి నాయకులు ఎన్నికల ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో ఇచ్చిన హామీలను నిలుపుకోవాలి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పీఆర్‌సీ నియమిస్తామని, ఐ.ఆర్ ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ఏడాది గడిచినా ఆ మాట ఎత్తకపోవడం బాధాకరం. దసరా కానుకగా కనీసం రెండు డీఏలను ఇవ్వాలి. పీఆర్‌సీ కమిటీని నియమించి, జనవరి లోపు 12వ పీఆర్‌సీ అమలు చేయాలి. –పి.నరేష్‌బాబు,
కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం
ఉద్యోగుల్లో అసంతృప్తి
ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి బయట పడుతుంది. అది ఉద్యమ రూపం దాల్చక ముందే ప్రభుత్వం స్పందించాలి. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమ బాట చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. తక్షణం 12వ పీఆర్‌సీ చైర్మన్ నియమించి, డీఏలు ఇవ్వాలి.
–ధీపాటి సురేష్‌బాబు,
కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ

పోరాటం ఉధృతం

పోరాటం ఉధృతం

పోరాటం ఉధృతం