ఏనుగు పాదానికి గాయమైందని వెళితే.. విసిరికొట్టింది!

Zookeeper Deceased By Elephant Trunk In Spain - Sakshi

మాడ్రిడ్: ఓ ఏనుగు తన తొండంతో గట్టిగా కొట్టి, ఎన్‌క్లోజర్‌ నుంచి జూ కీపర్‌ను బయటకు విసిరేసింది. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తర స్పెయిన్‌లోని కాంటాబ్రియాలోని కాబార్సెనో నాచురల్ పార్క్‌లో జూ కీపర్‌ జోక్విన్ గుటిరెజ్ ఆర్నైజ్(44)పై ఆడ ఆఫ్రికన్ ఏనుగు తన తొండం​తో దాడి చేసింది. దీంతో జూ కీపర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నామని తెలిపారు.

ఈ ఘటనపై స్పెయిన్‌ పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఏనుగు పాదానికి ఇన్‌ఫెక్షన్‌‌ అయినట్లు తెలుస్తోంది. ఆ గాయం స్థితిని తెలుసుకోవడానికి జూకీపర్ దాని వద్దకు‌ వెళ్లాడు. అదే సమయంలో ఏనుగుకు దగ్గు రావటంతో అది ఒక్కసారిగా తన తొండాన్ని బలంగా ముందుకు విసిరింది. దీంతో దాని పాదాల వద్ద ఉన్న జూ కీపర్‌ ఎన్‌క్లోజర్‌ అవతలపడ్డాడని తెలిపారు. ఆ ఏనుగు తొండానికి చాల బలం ఉంటుందని, అది మనుషులకు తగిలితే బతకటం కష్టమని పేర్కొన్నాడు. ఈ ఘటన చోటు చేసుకోవటం బాధాకరం, 30 ఏళ్ల జూ చరిత్ర ఇటువంటి ప్రమాదం ఇదే మొదటిసారి జరిగిందని ఆయన తెలిపాడు.

చదవండి:
 తమ్ముడి ఆత్మహత్య.. ఆవేదనతో అన్న కూడా

మాట్లాడుకుందామని పిలిచి మోడల్‌పై ఆత్యాచారం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top