సబ్‌ ఇన్‌స్పెక్టర్‌నంటూ.. యువతులకు వాట్సప్‌లో మెసేజ్‌ చేసి..

Youth Arrested For Cheating Girl In The Name Of Police Warangal - Sakshi

సాక్షి,వరంగల్‌: నేను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ని, నా పేరు దేవేందర్‌.. నేను కరీంనగర్‌ 2వ టౌన్‌ ఎస్సైగా పని చేస్తున్నాను. గతంలో వివిధ జిల్లాలో పనిచేశాను. నన్ను ప్రేమించాలి అంటూ ఆరుగురు యువతులకు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా చాటింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. మరణించిన ఎస్సై శ్రీనివాస్‌ ఫొటోను తన ప్రొఫైల్‌ ఫొటోగా పెట్టుకుని యువతులను వేధింపులకు గురిచేసిన యువకున్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన  యువకున్ని చూసి పోలీసులు ఒక్కసారిగా నివ్వెర పోయారు.

యువతులను వేధించడంతో వారు పోలీసులను అశ్రయించడం.. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగప్రవేశం చేయడంతో అతగాడి బండారం బయట పడింది. పోలీసులు నిందితున్ని అరెస్టు చేసే క్రమంలో ఇంత చేసింది వివకలాంగుడు కావడంతో అశ్చర్యపోయారు. నిందితుడు ఖానాపూర్‌ మండలం కొత్తిమామిడి తండాకు చెందిన జాటోతు మహేష్‌ (20) వికలాంగుడని టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ తెలిపారు. నిందితుడు గతంలో ఫేక్‌ డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేసిన సంఘటనలో కౌన్సెలింగ్‌ చేసి హెచ్చరించి వదిలిపెట్టినా అతనిలో మార్పు రాలేదని ఆయన తెలిపారు. దీంతో సోమవారం అరెస్టు చేసినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top