ప్రాణం తీసిన వీడియో కాల్‌ | Young Man Slipped From The Balcony While Talking Video Call | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వీడియో కాల్‌

Jul 17 2021 11:21 PM | Updated on Jul 17 2021 11:44 PM

Young Man Slipped From The Balcony While Talking Video Call - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: సెల్‌ఫోన్‌లో వీడియో కాల్ మాట్లాడుతూ రెండో అంతస్తు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్‌​స్టేషన్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకుంది. మణికొండలో నివసించే తాళ్లూరి శ్యామ్యూల్ సుజిత్ (32) ప్రైవేటు ఉద్యోగి. శనివారం ఉదయం తన సోదరుడితో ఫోన్‌లో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. రెండో అంతస్తులోని బాల్కనీలో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు సుజిత్‌ జారిపడ్డాడు.

వెంటనే స్పందించిన పక్కింటివారు సుజిత్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన సుజిత్‌ను కుటుంబసభ్యులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సుజిత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి సోదరుడు సుశీల్ బాగ్యరాజ్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement