ఓఆర్‌ఆర్‌పై కారు ప్రమాదం.. టీఆర్‌ఎస్‌ నేత కుమారుడు దుర్మరణం

Young Man Died In Road Accident At Shamshabad ORR - Sakshi

సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్‌ రింగ్ రోడ్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను హ్యుందాయ్‌ వెర్నా కారు బలంగా ఢీకొట్టింది. కారు బోల్తాపడటంతో అందులోని యువకుడు మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.

మాజీ ఎంపీపీ కొడుకు
చనిపోయిన వ్యక్తిని నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీపీ రెగట్టే మల్లికార్జున రెడ్డి కుమారుడు దినేష్‌ రెడ్డిగా గుర్తించారు. దినేష్‌రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తమ కొడుకు కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. నల్లగొండలోనీ వీటి కాలనీలోని రేగట్టే స్వగృహానికి  ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించారు. 

మంత్రి జగదీష్‌ రెడ్డి పరామర్శ
టీఆర్ఎస్ నాయకుడు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ మున్సిపల్‌ చైర్మెన్‌ మందడి సైదిరెడ్డి పరామర్శించారు.

చదవండి: ఏడాదిన్నర కిందట పెళ్లి.. 9 నెలల బాబు.. చిన్న గొడవకే

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top