Young Man Commits Suicide Over Love Failure At Hyderabad, Details Inside - Sakshi
Sakshi News home page

బంధువుల అమ్మాయితో ప్రేమ.. ప్రేయసి బర్త్‌డే అని ఇంటికి వెళ్తే

Nov 17 2022 2:50 PM | Updated on Nov 17 2022 4:35 PM

Young Man Commits Suicide Over Love Failure At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమ విఫలమై తీవ్ర మనోవేదనకు గురైన యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఎల్లప్ప తెలిపిన వివరాల మేరకు.. అడ్డగుట్ట సీ సెక్షన్‌ ప్రాంతానికి చెందిన అరుణ్‌కుమార్‌(21) ఉద్యోగం మానేసి రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. అరుణ్‌కు తన బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారిని మందలించారు. అప్పటి నుంచి వాళ్లు కలుసుకోవడం లేదు.

ఇటీవల తన ప్రేయసి బర్త్‌డే సందర్భంగా వారి ఇంటికి అరుణ్‌ వెళ్లగా ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా మందలించడంతో కొంత కాలంగా అరుణ్‌ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అతడి తండ్రికి క్యారేజ్‌ ఇచ్చి ఇంటికెళ్లిన అరుణ్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మరుసటి రోజు స్టోర్‌ రూమ్‌ తాళం తెరిచి ఉండడాన్ని గమనించిన అరుణ్‌ తండ్రి తలుపులు తీసేందుకు ప్రయత్నిచగా రాకపోవడంతో కిటికీలో నుంచి చూడగా అరుణ్‌ ఉరేసుకొని కనిపించాడు.

వెంటనే తలుపులు బద్దలుగొట్టి అరుణ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న తుకారాంగేట్‌ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అరుణ్‌   

Advertisement
 
Advertisement
Advertisement